![]() |
![]() |
.webp)
మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. ఇది మరో బిగ్ బాస్ లా ఉంది అన్న టాక్ ని కూడా సొంతం చేసుకుంది. ఇక ఫస్ట్ సీజన్ పూర్తి చేసుకుంది. ఇందులో పార్టిసిపేట్ చేసిన జోడీలు కొన్ని ఇంటర్వ్యూస్ లో మిగతా వాళ్ళు ఎలాంటి వాళ్ళు మాన్షన్ లో ఎం చేశారు అన్నది చెప్పుకొచ్చారు. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో విన్నర్స్ ఐన వాసంతి - పవన్ కళ్యాణ్ కూడా మాన్షన్ మేట్స్ గురించి అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. " మహేష్ - సాండ్రా " అని హోస్ట్ అడిగేసరికి "మనమంటాం కదా మంచోడరా అలా వ్యక్తి మహేష్" అని చెప్పారు ఇద్దరూ.
"నటరాజ్ - నీతూ " అని హోస్ట్ అడిగేసరికి "వీళ్ళిద్దరూ మంచి ఫామిలీ పర్సన్స్. నీతూ అక్క నటరాజ్ మాష్టర్ ఫాలోవర్ అంతే. అది కూడా పాజిటివ్ వేలో. నా హజ్ బెండ్. నా మొగుడు రా భయ్ అన్నట్టు ఉంటుంది. నటరాజ్ మాష్టర్ ఎం చేసినా సంతోషం వెతుక్కుంటుంది అక్క. మంచి అడ్మయిర్ చేస్తుంది. మా ఆయన ఇలా ఉన్నాడు అని అతనికి బాగా సపోర్ట్ చేస్తుంది. నటరాజ్ మాష్టర్ కూడా చాలా కస్టపడి వచ్చిన వ్యక్తి. మాన్షన్ లో గేమ్ ఐపోయిన తర్వాత అక్కకు సేవలు చేస్తూ ఉంటారు. గేమ్ గేమ్ అంతే మిగతా టైం అంతా సేవలు చేసుకుంటూనే ఉంటాడు. ఆయన అది తెమ్మా అంటే ఆయన కూడా అమ్మా ఇది తెమ్మ అనుకుంటారు. వాళ్ళు ఉంటె ఒక ఫామిలీ వైబ్ వస్తుంది." అని చెప్పింది వాసంతి.
"నాకు అక్కకు చాలా మంచి బాండ్ ఉంది. పొద్దున్న లేవగానే తమ్ముడు కాఫీ అంటుంది నేను కూడా ఒక్కోసారి అక్కా కాఫీ కావాలా అంటుంది. బ్రెడ్ కావాలి తమ్ముడు అంటుంది అలా మ్యూచువల్ గా మేము మాట్లాడుకుంటూ ఉంటాం" అని చెప్పాడు పవన్ కళ్యాణ్. "ఇక ప్రియాంక - శివ్ అనే వాళ్ళు ఒక పాజిటివ్ వైబ్ కపుల్ . ఇద్దరూ మెచ్యూర్డ్ పర్సన్స్. ప్రియాంకా ఇంకా మెచ్యూర్డ్ గా ఉంటుంది. శివ్ కనిపించడు కానీ చాలా ఫన్ చేస్తాడు. అలాగే మంచి గేమర్ కూడా. శివ్ ఉండి ఉంటె గేమ్ ఇంకోలా ఉండేది. మొత్తం పొజిషన్స్ అన్నీ మారేవి. ఒక టఫ్ కంటెస్టెంట్ ఉంటే అన్ని రకాలుగా గేమ్ మారేది. ఎలిమినేషన్ అంటే ప్రియాంక - శివ్, బ్రిట్టో - సంధ్య వాళ్ళది మాకు చాలా బాధగా అనిపించింది. వీళ్ళు లాస్ట్ వరకు ఉండి ఉంటె బాగుండు అనిపించింది" అని చెప్పారు వాసంతి - కళ్యాణ్ .
![]() |
![]() |